వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాను కిరణ్ ఎపిసోడ్‌లో గర్ల్ ఫ్రెండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
రామాయణంలో పిడకలవేటలా మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ఎపిసోడ్‌లో గర్ల్ ఫ్రెండ్ కథనం ముందుకు వచ్చింది. భాను కిరణ్‌కు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందంటూ ఆమె చేత కొన్ని టీవీ చానెళ్లు ఫోన్లో మాట్లాడించారు. ఆమె హైదరాబాదు శివారులోని ఉప్పల్‌లో ఉందట. ఆమె పేరు అనూష అని కూడా తేల్చేశాయి. భాను కిరణ్ తనకు ఓ పెళ్లిలో పరిచయమయ్యాడని ఆ గర్ల్ ఫ్రెండ్ చెప్పుకుంది. భానుతో ఆమె సంబంధాలను వివరంగా చెప్పింది.

సూరితో తాను ఒక్కసారి మాట్లాడానని చెబుతూ సూరిని ఆమె అంకుల్‌గా సంబోధించింది. భాను కిరణ్‌తో తాను తరుచూ పోట్లాడేదాన్నని ఆమె చెప్పింది. తాను వ్యాపారం చేస్తుంటానని భాను తనతో చెప్పేవాడని, అది ఏ వ్యాపారమో చెప్పేవాడు కాదని ఆమె అన్నది. భాను ఏం చేస్తాడో తనకు తెలియదని చెప్పింది. టీవీ చానెళ్లతో ఆమె చాలా ఉల్లాసంగా మాట్లాడింది. తనను పెళ్లి చేసుకుంటానని భాను ఆమెకు హామీ ఇచ్చాడట. డిసెంబర్ 31వ తేదీ రాత్రి మాత్రం ఫోన్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పినట్లు ఆమె తెలిపింది. ఈ గర్ల్ ఫ్రెండ్ సీరియస్ ఎపిసోడ్‌లో సైడ్ ట్రాక్‌లా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X