భారత క్రికెట్ జట్టు పైనల్లో గెలిచిన ఆనందంలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భావోద్వేగాన్ని నిలువరించుకోలేకపోయిందట. ప్రపంచ కప్ అందుకున్న ఆనందంలో యువరాజ్ సింగ్ కంట తడి పెట్టాడు. యువీ ఏడ్వడం చూసి తట్టుకోలేక తాను ఏడ్చేశానని శిల్పా శెట్టి చెప్పింది. యువరాజ్ సింగ్ ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) జట్టుకు శిల్పా శెట్టి యజమానురాలు.
అందువల్ల యువీ ఏడ్చేస్తుందడడంతో తాను తట్టుకోలేక ఏడ్చేశానని, ఆ క్షణం అటువంటిదని ఆమె ఓ టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పింది. 1983లో ఇండియా ప్రపంచ కప్ టైటిల్ గెలిచినప్పుడు తన తండ్రి కంట తడి పెట్టాడని ఆమె గుర్తు చేసుకుంది. ఆ ఉద్వేగమే తనను ఈసారి ముంచేసిందని చెబుతోంది.
Bollywood actress Shilpa Shetty found it hard to control her emotions after India won the cricket World Cup Saturday. She broke down in tears when she saw Yuvraj cry.
Story first published: Monday, April 4, 2011, 10:42 [IST]