వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ సగం భారతీయుడన్న కత్రినా కైఫ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Katrina Kaif
ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీపై ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఓ పత్రికకు ఇచ్చిన ముఖాముఖి(ఇంటర్వ్యూ)లో ఆమె రాహుల్ గాంధీ హాఫ్ ఇండియన్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కత్రినా పాస్ పోర్టు, సర్ నేమ్ తదితర అంశాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నించినప్పుడు ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రపంచంలో నివసిస్తున్న సగం ఆసియన్, సగం బ్రిటిష్ తానొక్కదానినే కాదని చెప్పారు. ఇది అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు.

నా పాసుపోర్టు కాపీలు ప్రతి న్యూస్ చానల్ వద్ద ఉన్నాయని అయితే అవి వారి వద్దకు ఎలా వెళ్లాయని మాత్రం అడగవద్దని కోరారు. ప్రతి ఒక్కరు తనలాగే పాసుపోర్టుపై తల్లి పేరును, తన పేరును కలిగి ఉంటారని చెప్పారు. తాను హాంగ్‌కాంగులో పుట్టానని అయితే అది ఇష్యూ కాదని అన్నారు. ఒకవేళ తాను హాఫ్ ఆసియన్, హాఫ్ యూరోపియన్ అయితే కాంగ్రెసు పార్టీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ సైతం సగం భారతీయుడు సగం ఇటాలియన్ అవుతారని చెప్పారు.

English summary
Katrina Kaif said in an interview that Am I supposed to be ashamed that I am half Asian, half European? I mean, no! Rahul Gandhi is half Indian, half Italian.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X