వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు కావూరి అడ్డం వేశారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao
సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానమ ఆలోచనను మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణపై తమ వైఖరిని పార్టీ అధిష్టానం సోమవారంనాడే ప్రకటిస్తుందని భావించారు. ఆ దిశగా అధిష్టానం చర్యలు తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అకస్మాత్తుగా తెలంగాణపై అధిష్టానం నాన్చుడు ధోరణికి, కాలయాపనకు పూనుకుంది. దీనివెనక కావూరి సాంబశివ రావు హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. చిరంజీవితోనూ కావూరి సాంబశివ రావుతోనూ మినీ కోర్ కమిటీ సోమవారం చర్చలు జరపాల్సి ఉంది. కానీ, కావూరి సాంబశివ రావు ఆదివారంనాడే ఢిల్లీకి చేరుకుని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంతోనే కాంగ్రెసు అధిష్టానం ఆలోచన మారినట్లు చెబుతున్నారు.

సోమవారం చిరంజీవితోనూ రేణుకా చౌదరితోనూ మినీ కోర్ కమిటీ చర్చలు జరిపిన తర్వాత మూడో దశలో జాతీయ పార్టీలతో చర్చలు జరపాల్సి ఉందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ప్రకటన చేసి, తెలంగాణపై ఇప్పుడే తేల్చబోమని చెప్పకనే చెప్పారు. మంగళవారం కోర్ కమిటీ సమావేశం కూడా సకల జనుల సమ్మెను విరమింపజేయడంపైనే దృష్టి సారించింది తప్ప తెలంగాణపై తన వైఖరిని ప్రకటించడంపై పెట్టలేదు. ఏమైనా, తెలంగాణపై కాంగ్రెసు వైఖరి ఇప్పట్లో తేలే విధంగా లేదు.

English summary
It is said that Seemandhra MP Kavuri Sambasiva Rao has changed the mood of Congress high command on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X