వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆమెకు సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathyavathi Rathod
కేరళలో ఓటర్లు ప్రతి సాధారణ ఎన్నికలలో ప్రభుత్వాన్ని మారుస్తుంటారు. అక్కడ ఓసారి యుడిఎఫ్ అధికారంలోకి వస్తే మరోసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తుంది. గత కొన్నేళ్లుగా ఇది పునరావృతం అవుతుంది. అక్కడ ఇదో సెంటిమెంటు అయిపోయింది. కేరళ మాదిరిగానే వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గం ఓటర్లు సైతం ఓ సెంటిమెంటు ఉన్నట్లుగా కనిపిస్తోంది. అక్కడి ఓటర్లు ఎవరిని ఎన్నుకున్నా వరుసగా నాలుగు సార్లు ఎన్నుకోవడం విశేషం. అది అనుకోకుండా జరిగిన అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వారు వరుసగా నాలుగు సార్లు ఎన్నుకోబడతారంట. గతంలో కాంగ్రెసు ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి వరుసగా నాలుగు సార్లు గెలిపొందారు. తర్వాత అదే పార్టీకి చెందిన రెడ్యా నాయక్ సైతం వరుసగా నాలుగు సార్లు అక్కడి నుండి గెలుపొందారు. గత సాధారణ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి సత్యవతి చేతుల్లో ఓడిపోయారు.

అయితే ఇటీవల ఆమె ప్రత్యర్థి రెడ్యానాయక్ నియోజకవర్గంలో తిరుగుతూ ఆమెపై విమర్శలు సంధిస్తే ఆమెకు సెంటిమెంటు ఆయుధంగా దొరికింది. రెడ్యానాయక్ తనకు వ్యతిరేకంగా ఏం చెప్పినా డోర్నకల్‌లో ఎవరైనా వరుసగా నాలుగు సార్లు గెలుస్తారు. అంటే నాకు ఇంకా మూడు టర్ములు ఉందని చెబుతున్నారంట. ఈ సెంటిమెంటు ప్రత్యర్థులకు కొరుకుడు పడటం లేదంట. అయితే తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించని టిడిపిలో ఉన్న సత్యవతి వచ్చే ఎన్నికలలో గెలిచే అవకాశాలు లేవని ప్రత్యర్థి వర్గాలు భావిస్తున్నాయంట. అదే సమయంలో కాంగ్రెసు తెలంగాణ ప్రకటిస్తే తమకు తిరుగులేదని కూడా భావిస్తున్నారంట. మరి 2014లో ఏమవుతుందో చూడాలి!

English summary
It seems, TDP mla Sathyavathi Rathod hoped that the sentiment repeats in Dornakal constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X