వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్యూరప్పకు ధర్మస్థలి గండం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మైనింగ్ పనుల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారని, అక్రమాల వల్ల రాష్ట్రానికి సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఇటీవల లోకాయుక్త సంతోష్ హెగ్డె కర్నాటక ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం, దాంతో కర్నాటక బిజిపిలో తీవ్ర సంక్షోభం ఏర్పడటం యడ్యూరప్ప రాజీనామాకు అధిష్టానం ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. అయితే మూడేళ్లుగా కర్నాటక బిజెపి తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూనే ఉంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఎదురు తిరగడంతో అవిశ్వాస తీర్మానం వరకు వెళ్లినప్పటికీ మళ్లీ సద్దుమణిగి పోయింది. ఇన్ని సంక్షోభాలు ఎదుర్కొన్న యడ్డీకి ఇప్పుడే పదవి గండం ఎందుకు వచ్చిందంటే పలువురు ధర్మస్థలిని చూపిస్తున్నారు.

ఇటీవల జెడి(ఎస్) నేత కుమారస్వామి, యడ్డీలు అక్రమాలు, అవినీతిపై పవిత్ర పుణ్యస్థలం అయిన ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తామని గత నెల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆలయ పూజారులు ధర్మస్థలలో రాజకీయ నాయకులు అలాంటి ప్రమాణాలు చేయవద్దని సూచించడంతో ఆయన వెనక్కి తగ్గారు. ప్రమాణం చేస్తామని ప్రకటించిన రోజు కుమారస్వామి ధర్మస్థల వెళ్లారు. యడ్డీ కోసం కాసేపు నిరీక్షించి ఆయన రావడం లేదని వెనక్కి తిరిగి వెళ్లి పోయారు. అయితే తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడటం లేదని అబద్దాలు చెప్పి పవిత్ర స్థలంలో ప్రమాణానికి సిద్ధమైనందునే ఆయనకు పదవీ గండం పట్టిందని పలువురు భావిస్తున్నారు.

English summary
Some people are suspecting that the Yeddyurappa step down due to false promise at Dharmasthala on corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X