వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర రాజకీయాల్లోకి జయప్రద

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprada
నా కోసం చెమ్మగిల్ల నయనమ్మ లేదు అని సమాజ్‌వాదీ బహిష్కృత నేత అమర్ సింగ్ వేదన చెందుతున్న సమయంలో అండగా నిలిచిన తెలుగు సినీ తార, పార్లమెంటు సభ్యురాలు రాష్ట్ర రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. తనకు ఇంత కాలం రాజకీయాల్లో తోడునీడగా నిలిచిన అమర్ సింగ్ ఆరోగ్యం చెడిపోయి, కేసులో ఇరుక్కుని బాధపడుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆమెకు నిలువ నీడ లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టవచ్చునని అంటున్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో జయప్రద చేరుతుండవచ్చునని అప్పట్లో ఊహాగానాలు చెలరేగాయి. అయితే, ఆమె మనసు మార్చుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆమె ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. దీన్నిబట్టి ఆమె కాంగ్రెసు పార్టీలో కాలు మోపుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన పాత గూడు తెలుగుదేశం పార్టీలో మాత్రం ఆమె చేరే అవకాశాలు లేవని అంటున్నారు. మొత్తమ్మీద ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి రావడం ఖాయమని చెబుతున్నారు.

English summary
Film star and MP Jayaprada may enter state politics, as Amar Singh is not in a position to help.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X