వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమితాబ్‌పై జయప్రద గుర్రు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprada
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌పై సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రద గుర్రుగా ఉన్నారు. తన మిత్రుడు అమర్ సింగ్ అరెస్టయి జైల్లో ఉంటే అమితాబ్ పట్టించుకోకపోవడాన్ని ఆమె తప్పు పడుతున్నారు. అమితాబ్ గానీ ఆయన భార్య జయభాదురి గానీ అమర్ సింగ్‌ను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఒకప్పుడు అమర్ సింగ్‌ను అంటి పెట్టుకుని ఉండే ఆ కుటుంబం ఇప్పుడు ఏమీ కానట్లు వ్యవహరిస్తోందని జయప్రద కోపం.

అమితాబ్ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు అమర్ సింగ్ ఆదుకున్నారని, ఇప్పుడు అమర్ సింగ్ కష్టాల్లో ఉంటే పట్టించుకోకపోవడం తనను బాధ పెడతోందని ఆమె అంటోంది. సమాజ్‌వాదీ పార్టీ నుంచి అమర్ సింగ్‌ను బహిష్కరించినప్పుడు జయప్రద ఆయనకు తోడుగా నిలిచారు. ఇప్పుడు కూడా అమర్ సింగ్ తరఫున ఆమె వకాల్తా పుచ్చుకుంటోంది.

English summary
MP and actress Jayaprada expressed her unhappiness towards Amitabh Bachchan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X