వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయసుధకు రాజకీయ ఊరట

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayasudha
కొన్ని సమస్యలను కాలమే పరిష్కరిస్తుందని అంటారు. సికింద్రాబాద్ కాంగ్రెసు శాసనసభ్యురాలు జయసుధ విషయంలో ఈ విషయం నిజమవుతోంది. తన ప్రత్యర్థి నుంచి ఆమెకు ఊరట లభించబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బండ కార్తిక రెడ్డికి, జయసుధకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే సంబంధాలున్నాయి. గతంలో ఇరువురి మధ్య వైరం రచ్చకెక్కింది కూడా. కార్తిక రెడ్డి భర్త తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని అప్పట్లో జయసుధ మండిపడ్డారు. కార్తిక రెడ్డి తీరుపై భగ్గుమన్నారు.

జయసుధను కార్తిక రెడ్డి లెక్క కూడా చేసినట్లు కనిపించలేదు. జయసుధ పట్టు వీడకుండా కయ్యానికి కాలు దువ్వారు. అప్పట్లో ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండేవారు. వారిద్దరి మధ్య పంచాయతీ ఆయన దాకా వెళ్లింది. జయసుధ తన బాధను రోశయ్య వద్ద వెల్లబోసుకున్నారు. సమస్య పరిష్కారమైందో కాలేదో తెలియదు గానీ చాలా కాలంగా ఇరువురి మధ్య గొడవలు వీధికెక్కిన దాఖలాలు లేవు. అయితే డిసెంబర్‌లో కార్తిక రెడ్డి మేయర్ పదవికి కత్తెర పడుతోంది. మేయర్ పదవిని మజ్లీస్‌కు అప్పగించాల్సి వస్తుండడంతో ఆమె దిగిపోక తప్పని పరిస్థితి. ఇది జయసుధకు ఎంతైనా గుండె నిండా ఊపిరి పీల్చుకునే ఊరటే కదా.

English summary
Secunderabad MLA Jayasudha may get relief politically in December, as Karthika reddy to get down from Mayoral post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X