హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కార్తీక రెడ్డితో జయసుధ కయ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayasudha
హైదరాబాద్ మేయర్ కార్తీక రెడ్డితో కాంగ్రెసు సికింద్రాబాదు శాసనసభ్యురాలు జయసుధ మరోసారి కయ్యానికి దిగారు. ఇంతకు ముందు ఓసారి వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. మళ్లీ వీరిద్దరికి మధ్య పడడం లేదు. ఓ అధికారి బదిలీ వ్యవహారంపై కార్తీక రెడ్డిపై జయసుధ చిటపటలాడుతున్నారు. జల మండలి పరిధిలోని తార్నాకా డివిజన్‌లో పనిచేస్తున్న వినోద్‌ను మేనేజింగ్ డైరెక్టర్ ఎం. జగదీశ్వర్ బదిలీ చేశారు.

ఆ బదిలీ వ్యవహారమంతా కార్తీక రెడ్డి నడిపించారని తెలుసుకున్న జయసుధ తోక తొక్కిన నాగులా బుసకొట్టారు. ఎండీ జగదీశ్వర్‌ను కడిగేశారు. ఈ కయ్యం ఎంత దాకా వెళ్తుందో చూడాలి. గతంలో జయసుధతో కార్తీక రెడ్డికి రోశయ్య అమాయకుడిలా సంధి కుదిర్చారని, ఇప్పుడు జయసుధ పప్పులు ఉడకవని అంటున్నారు. జయసుధ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌కు మద్దతు పలుకుతున్నారు. ఈ స్థితిలో ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కార్తీక రెడ్డిని మరింత ఎగదోయవచ్చునని అంటున్నారు.

English summary
Congress MLA Jayasudha expressed anguish at mayor Karthika Reddy for intervening in a transfer of metro water works officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X