వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ వ్యవహారశైలి వల్లే జంప్‌లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ముగ్గురు కాంగ్రెసు శాసనసభ్యులు పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి జంప్ చేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలే కారణమని నిందిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వేధింపుల వల్లనే వారు పార్టీని వీడారని ఓ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. వారు పార్టీని వీడనున్నట్లు ముందే తెలిసినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదని అంటున్నారు. కనీసం, వారితో ఓసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేసిన పాపాన పోలేదని అంటున్నారు. దాంతోనే వారు కాంగ్రెసుకు గుడ్‌బై చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే, కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచన మరో విధంగా ఉందట. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప పరిస్థితిని చక్కదిద్దలేమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. తాను ఈ విషయం చెప్పినా పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆయన కాస్తా అలక ముద్ర వహించినట్లు చెబుతున్నారు. చెప్తే విననప్పుడు తాను చేసేదేం ఉంటుందని ఆయన చేతులు కట్టుకుని కూర్చుంటున్నారని చెబుతున్నారు. ఏమైనా, కాంగ్రెసుకు కష్టకాలం ముంచుకొచ్చినట్లే కనిపిస్తోంది.

English summary
It is said that CM Kiran Kumar Reddy's cold attitude triggered the defection of three Congress Telangana MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X