వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న వీరప్పన్ నేడు కిషన్‌జీ: అధికారి ఒక్కరే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishanji and Veerappan
ఏడేళ్ల క్రితం గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్, తాజాగా మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీని మట్టుపెట్టిన ఆపరేషన్‌లకు నాయకత్వం వహించిన అధికారి ఒక్కరే. అతనే సిఆర్‌పిఎఫ్ డిజి టి.కె విజయ్ కుమార్. మెరుపుదాడులు నిర్వహించడంలో అతడు దిట్ట. కీలక సమయాలలో కీలక పదవుల్లో నియమితులైన విజయ్ తన వ్యూహాల ద్వారా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో మావోయిస్టు దాడులతో వందల సంఖ్యలో సహోద్యోగులను కోల్పోతున్న సమయంలో సిఆర్పీఎఫ్ డిజిగా బాధ్యతలు చేపట్టి కిషన్‌జీని ఎన్‌కౌంటర్ ద్వారా మావోయిస్టుల ఆత్మస్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీశారు.

2004లోనూ ఎస్టీఎఫ్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించాక వీరప్పన్‌ను పట్టుకునేందుకు ఆపరేషన్ కకూన్ రూపొందించారు. వీరప్పన్ కదలికలపై కన్నేసిన విజయ్ గ్రూప్ ఇరవై నెలల పాటు నిర్విరామంగా మూడో కంటికి తెలియకుండా పని చేస్తూ చివరకు ఆయనను తుద ముట్టించింది. విజయ్ దాదాపు రెండేళ్లు చెన్నై నగర పోలీసు కమీషనర్‌గా పని చేసి వెయ్యి మంది రౌడీలు, రౌడీషీటర్లను పిడి చట్టం ద్వారా సంవత్సరంపాటు జైలులో ఉంచారు. అయితే ఎస్టీఎఫ్ చీఫ్ గా ఉన్న విజయ్ కేంద్రమంత్రి చిదంబరం పిలుపు మేరకే సిఆర్పీఎఫ్ చీఫ్‌గా నియమితుడైనట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
CRPF officer Vijay Kumar is chief of operations in killing smugler Veerappan and maoist leader Kishanji.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X