• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిత్యానందులవారు సెక్స్ చేయలేరా?

By Pratap
|

Nithyananda Swami
శతకోటి సమస్యలు అనంత కోటి ఉపాయాలని అంటారు. నిత్యానంద స్వామిగారి విషయంలో ఇదే సామెత గుర్తొస్తోంది. నిత్యానంద స్వామి సెక్స్ చేయలేరని స్వయంగా ఆయన తరఫు న్యాయవాది నాగేశ్ చెబుతున్నారు. ఈ మేరకు ఆయన మద్రాసు హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో నివేదించడమే కాకుండా వైద్య పరీక్షల ఫలితాలను కూడా జత చేశారట. నిత్యానంద స్వామి దేహస్థితికి సెక్స్‌కు పనికి రాదని ఆయనగారు సెలవిచ్చారు. ఆయన దేహస్థితి ఆరేళ్ల పిల్లవాడిని పోలి ఉంటుందట. వీర్యకణాల కౌంట్ కూడా నిత్యానందుల వారికి పెద్దగా లేదని చెప్పారు.

సినీనటి రంజితతో నిద్యానందస్వామి సెక్స్ పాల్గొన్నారనే ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన కుండ బద్దలు కొట్టే పనికి పూనుకున్నారు. కావాలంటే వైద్య పరీక్షల నివేదికలను పరిశీలించుకోవచ్చునని చెప్పారట. ఏడాది పైనుంచి దాదాపు మౌనంగా ఉన్న నిత్యానంద స్వాములవారు, రంజిత తమపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని చెప్పడానికి బహిరంగంగా జంటగా కూడా ముందుకు వచ్చారు. వీరిద్దరి వెనక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉందనే ప్రచారం గుప్పుమంటోంది.

English summary
It is said that Nithyananda is not able to do sex. This arguement is put forward by Nithyananda's lawyer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X