వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూనం పాండే ట్విస్టులెందుకో!

By Pratap
|
Google Oneindia TeluguNews

Poonam Pandey
ప్రపంచ కప్ పోటీల్లో భారత్ గెలిస్తే దుస్తులిప్సేసి నగ్న ప్రదర్శన ఇస్తానని నానా హంగామా చేసిన మోడల్ పూనం పాండే తోక ముడిచింది. అన్ని వైపుల నుంచి నిరసన వ్యక్తం కావడం వల్లనో, తన పబ్లిసిటీ స్టంట్ ఫలితం సాధించడం వల్లనో తన మాట మార్చేసింది. తాను ఆ ప్రకటన సరదా కోసం చేశానని బొంకింది. తాను భారతీయురాలినని, బహిరంగంగా బట్టలిప్పడం వంటివి చేయనని ఆ అమ్మడు చల్లగా జారుకుంటోంది. అభిమానుల స్పందన కోసమే దుస్తులిప్పుతానని ప్రకటన చేశానని, నిజంగా బట్టలిప్పేయాలని కాదని ఆమె అంటోంది.

ఇంట్లో తల్లిదండ్రులు నెత్తీనోరు మొత్తుకోవడం, బాయ్ ఫ్రెండ్ వదిలేయడం, కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి రావడం వంటి కష్టాలెన్నో ఎదురయ్యాయి. అయితే అందుకు తగిన ఫలితం కూడా లభించింది. యాడ్ ఆఫర్లు ఆమెకు పెద్ద యెత్తున వస్తున్నాయట. దానికి తోడు, ఓ సినిమా చాన్సు కూడా ఆ భామామణి కొట్టేసినట్లు తెలుస్తోంది. ఏమైనా, ఈ అమ్మడికి వ్యాపార తెలివితేటలు దండిగా ఉన్నాయని అనుకోవాలి.

English summary
Indian model Poonam Pandey twisted her words on striping. She said that She made the statement for fun.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X