అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబా మృతితో రియాల్టీ విలవిల

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
సత్య సాయి బాబా మృతి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రియాల్టీ రంగాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. పుట్టపర్తిలో భూముల కొనుగోళ్లకు ఎవరూ ముందుకు రావడం లేదు. భూములపై ఆరాలు తీస్తున్నారు గానీ కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అంటున్నారు. సత్య సాయి బాబా ఆశ్రమం ప్రశాంతి నిలయానికి సమీపంలోని భూములు ఎకరానికి రెండు కోట్ల రూపాయల దాకా పలుకుతూ వచ్చాయి. అశ్రమానికి వెళ్లే ప్రధాన రహదారికి ఇరు వైపులా భూములు చుక్కలనంటాయి. ఎకరం 12 కోట్ల రూపాయల దాకా ఉన్నట్లు సమాచారం. పుట్టపర్తికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాహ్మణపల్లిలో ఎకరం భూమి ధర 50 లక్షల రూపాయల దాకా ఉంది. అయితే, సత్య సాయి బాబా మరణం తర్వాత భూ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి.

సత్య సాయి బాబా ప్రశాంతి నిలయంతో పుట్టపర్తి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఎక్కడెక్కడివారో పుట్టపర్తిలో సెటిల్ కావడానికి ఉత్సాహం చూపారు. అత్యధునాతమైన విల్లాలు, భవంతులు వెలిశాయి. దీంతో పుట్టపర్తిలో భూముల రేట్లకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు సత్య సాయి బాబా మృతితో భవిష్యత్తు ఏమిటో తెలియక భూములు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

English summary
In the last four weeks as Sathya Sai Baba battled for his life, the pilgrim town of Puttaparthi in Andhra Pradesh recorded no new land registrations, a stark shift from the usual substantial land deals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X