వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు ఎమ్మెల్యేల షాక్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ తగిలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తెలుగుదేశం మూడు స్థానాలకు, దాని మిత్రపక్షం సిపిఐ ఒక స్థానానికి పోటీ చేస్తున్నాయి. నాలుగో అభ్యర్థి గెలవాలంటే తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుల వ్యూహం మీదనే ఆధారపడి ఉంది. కాగా, ఇప్పటికే చంద్రబాబుకు షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాల నాగిరెడ్డి వైయస్ జగన్‌కు మద్దతిస్తున్నారు.

పోచారం శ్రీనివాస రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేస్తారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకుని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దగ్గరయ్యారు. సుమన్ రాథోడ్‌కు ఓటింగ్ హక్కు లేదు. కుల ధృవీకరణకు సంబంధించి ఆమెపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. దీంతో ఆమెకు ఓటు హక్కు లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే చంద్రబాబుకు నలుగురు శాసనసభ్యుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడే అవకాశాలు లేవు. మొత్తం మీద, కాంగ్రెసుకే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ తగిలే అవకాశాలున్నాయి.

English summary
TDP president N Chandrababu Naidu may face trouble in MLC election to be held under MLAs qouta. Two MLAs of TDP, Nallapureddy Prasanna Kumar Reddy and Bala Nagi Reddy are supporting YS Jagan. MLA Pocharam Srinivas Reddy decided to resign from TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X