వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూనియర్ ఎన్టీఆర్‌తో 'ఎన్టీఆర్' ఫైట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Tarakaratna-Jr Ntr
జూనియర్ ఎన్టీఆర్‌తో సోదరుడు నందమూరి తారకరత్న సమరానికి దిగారు. స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి దూకుడుగా వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్‌ను నిలువరించడమే ఆయన ఉద్దేశమని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన పేరులోంచి జూనియర్ అనే పదాన్ని తొలగించుకోగా, నందమూరి తారకరత్న తన పేరును ఎన్టీఆర్‌గా మార్చేసుకున్నారు. ప్రజల్లో అయోమయం సృష్టించి జూనియర్ ఎన్టీఆర్‌ను ఇరకాటంలో పెట్టాలనేది ఆయన ఉద్దేశమని అంటున్నారు.

కొంత కాలం దాకా జూనియర్ ఎన్టీఆర్‌తో నందమూరి తారకరత్న, కళ్యాణ్ రామ్ స్నేహంగానే వ్యవహరించారు. బాలకృష్ణ కూడా ఆయనను దగ్గరికి తీశారు. అయితే, పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య దూరం విపరీతంగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ఊసరవెల్లి ఆడియో విడుదలకు బాలకృష్ణ రాలేదు. సంపన్న కుటుంబానికి చెందిన లక్ష్మీప్రణతిని పెళ్లి చేసుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మారిపోయారని ఆయన కజిన్స్ అక్కసుతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
Jr Ntr wanted to avoid Jr as prefix for his name. But with Tarakaratna becoming NTR, there is going to be confusion in Tollywood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X