వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: పవార్‌కు విదర్భ భయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharad Pawar
తెలంగాణ అంశం ముందుకు రావడంతో కేంద్ర మంత్రి, మరాఠా మాంత్రికుడు శరద్ పవార్‌కు విదర్భ భయం పట్టుకున్నట్లుంది. తెలంగాణపై పార్లమెంటులో చర్చకు అనుమతించకూడదని ఆయన అభిప్రాయపడ్డారట. ఇద్దరు ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఆయనను సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అంటున్నారు. తెలంగాణ అంశం పార్లమెంటులో చర్చకు వస్తే విదర్భ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ముందుకు వస్తుందని ఆయన ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణతో పాటే విదర్భ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కూడా బలంగా ఉంది. నిజానికి జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటుకు ముందు ఏర్పడాల్సిన కొత్త రాష్ట్రాలు విదర్భ, తెలంగాణ అనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే వెంటనే విదర్భలో ప్రత్యేక చిచ్చు రగులుతుందని పవార్ అనుమానిస్తున్నారు. దీంతో అసలు పార్లమెంటులో తెలంగాణపై చర్చనే జరగకూడదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఎవరి తిప్పలు వారివి, పవార్ తిప్పలు పవార్‌వి.

English summary
NCP leader and Union minister Sharad Pawar is opposing debate on Telangana issue in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X