వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాసరిపై రామ్ చరణ్ వ్యాఖ్యల వెనక..

By Pratap
|
Google Oneindia TeluguNews

Dasari Narayana Rao
ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావుకు వ్యతిరేకంగా హీరో రామ్ చరణ్ తేజ వ్యాఖ్యలు చేయడం వెనక మతలబు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి, దాసరి నారాయణ రావుపై బడా హీరోలే వ్యాఖ్యలు చేయడానికి జంకుతారు. అటువంటిది రామ్ చరణ్ తేజ తనంత తానుగా ఆ సాహసం చేశాడంటే ఎవరూ నమ్మలేక పోతున్నారు. దాసరికి వ్యతిరేకంగా రామ్ చరణ్ తేజ వ్యాఖ్యలు చేయడం వెనక రాజకీయం ఉందనే మాట వినిపిస్తోంది.

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కావడంతో చిరంజీవి కాంగ్రెసు నాయకుడిగా మారిపోయారు. అప్పటికే కాంగ్రెసు పార్టీలో దాసరి నారాయణ రావు ఉన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చిరంజీవితో పాటు దాసరిని కూడా సమానంగా చూస్తున్నారని అంటున్నారు. ఈ ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో చిరంజీవికి దాసరి పోటీ వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలోనే దాసరి నారాయణరావుపై రామ్ చరణ్ తేజ చేత వ్యాఖ్యలు చేయించారని ఆంటున్నారు. అయితే, రామ్ చరణ్ తేజ చేత చిరంజీవి మాట్లాడించారా, అల్లు అరవింద్ మాట్లాడించారా అనేది తేలడం లేదని గిట్టనివారంటున్నారు.

English summary
Tollywood astonished about the comments made by Ran Charan Teja against Dasari Narayana rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X