తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రపతికి జగన్ వాడిన డొక్కు కారు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pratibha Patil
దేశధినేత అయిన ప్రతిభా పాటిల్ పట్ల మన అధికారులు అలసత్వం ప్రదర్శించారు. వర్షాకాల వెకేషన్‌కు వచ్చిన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పట్ల చిత్తూరు జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహించారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉపయోగించిన దెబ్బలు తిన్న కారును ఆమెకు కేటాయించారు. తన వెకేషన్‌లో భాగంగా ప్రతిభా పాటిల్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమెకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసి ప్రోటోకాల్ నిర్వర్తించాల్సిన అధికారులు కొంత అలసత్వం ప్రదర్శించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ప్రముఖ వ్యక్తి వస్తున్నప్పుడు వారి భద్రత, పర్యటించే ప్రాంతాల్లో నిఘా వర్గాల ఏర్పాటు, అతిథి గృహం తదితర వాటిని పదిరోజుల ముందే ఏర్పాటు చేస్తారు. అయితే దేశ అత్యున్నత ప్రతిభా పాటిల్ విషయంలో మాత్రం అది కనిపించలేదు.

రాష్ట్రపతికి అధికారులు అతి సాధారణ ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతిభకు కాన్వాయ్‌తో పాటు స్కార్పియోను కేటాయించారు. అయితే ఆమెకు కేటాయించిన స్కార్పియో బాయ్‌నెట్ నిండా సొట్టలు పడి ఉన్నాయి. ఈ వాహనాన్ని గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తన చిత్తూరు జిల్లా పర్యటనలో వాడారు. ఈ సమయంలో అంది బాగా దెబ్బతిన్నది. అయినప్పటికీ అధికారులు కనీసం మరమ్మతులు చేయించకుండానే కేటాయించారు. వ్యూ మిర్రర్‌లు పగిలో పోవడంతో వాటిని తొలగించారు. ఆ కారులోనే ప్రతిభ రెండు రోజులు తిరగడం విశేషం. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాగా ఆమె తన రాష్ట్ర పర్యటన ముగించుకొని ముంబయి వెళ్లారు.

కాగా గురువారం తిరుమలలో ప్రతిభా పాటిల్ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. స్వామి సన్నిధిలో గంట సేపు గడిపారు. తన వివాహ దినోత్సవాన్ని జరుపుకున్నారు. సంగీత కచేరిలో పాల్గొన్నారు. తిరుమలలో సంప్రదాయానికి అనుగుణంగా ప్రతిభా పాటిల్ భర్త దేవీసింగ్ రామ్ సింగ్ షేకావత్‌తో కలిసి శ్రీ వరాహస్వామిని దర్శించుకున్నారు. పుష్కరణిలో దిగి వందనం చేశారు. పవిత్ర జలాన్ని శిరస్సుపై చల్లుకున్నారు. తిరుమల నుండి సాయంత్రం తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

English summary
Chittoor officers arranged used vehicle to president Pratibha Patil yesterday in Tirupati. This car was used by YSR Congress party president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X