అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్య సాయి ఆస్పత్రికి వాస్తు దోషం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
సత్య సాయిబాబా ఉన్నత వైద్య శాస్త్ర సంస్థకు వాస్తు దోషం ఉందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పేదలకు ఉచితంగా స్పెషాలిటీ సేవలు అందించేందుుక 1991లో 11 నెలల కాలంలో 80 ఎకరాల్లో ఈ ఆస్పత్రిని నిర్మించారు. అయితే, ఈ ఆస్పత్రి సత్య సాయిబాబా కుటుంబానికి అచ్చి రావడం లేదట. ఈ ఆస్పత్రిలో సత్య సాయిబాబాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నలుగురు మరణించారు. సత్య సాయిబాబా మృతితో దానికి వాస్తు దోషం ఉందనేది అర్థమవుతోందని ఆయన కుటుంబ సభ్యులంటున్నారు. సత్య సాయిబాబాను మరో ఐసియులోకి గానీ బెంగుళూర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి గానీ మార్చాలని అడిగితే నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఆస్పత్రిలో బాబా అన్నయ్య రత్నం శేషం రాజు 1984లో మరణించారు. సాయిబాబా సోదరి వెంకమ్మ 1993లో మరణించింది. ఆ తర్వాత నాలుగేళ్లకు మరో సోదరి పార్వతమ్మ ఇదే ఆస్పత్రిలో చనిపోయింది. పార్వతమ్మ మనవరాలు చేతన రాజు ఇంట్లోనే సత్య సాయిబాబాకు వంటలు చేసి పంపించేవారు. ఆమె ఈశ్వరమ్మ మహిళా సంక్షేమ ట్రస్టుకు నేతృత్వం వహిస్తోంది. బాబా సోదరుడు జానకీ రామయ్య కూడా సత్య సాయిబాబా మరణించిన ఐసియులో మృతి చెందాడు. సత్య సాయి సెంట్రల్ ట్రస్టులో జానకీ రామయ్య కీలక పాత్ర పోషించేవారు. జనకీ రామయ్య కుమారుడు ఆర్.జె. రత్నాకర్ ప్రస్తుతం ట్రస్టు సభ్యుడు. రత్నాకర్ తల్లి మీనాక్షమ్మ సాయిబాబాకు అందరికన్నా సన్నిహితురాలు. ఆమె ఇంటి నుంచే బాబాకు రాగి ముద్ద, వేరుశనగ పచ్చడి వచ్చేవి.

English summary
The hospital's tryst with Sai Baba and his family members continues to be jinxed. The godman was the fifth person from the family to die in the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X