వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ మూడో ఎంపీ ఎవరు?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నట్లున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మద్దతిస్తున్న విషయం తెలిసిందే. వారిద్దరిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామా చేయగా, సబ్బం హరి ఆగిపోయారు. తాను ఆగిపోవడానికి ఆయన విచిత్రమైన కారణం చెప్పారు. మరో ఎంపీ రాజీనామా చేస్తానని చెప్పాడని, తనను ఆగాలని చెప్పాడని, దాంతో తాను ఆగిపోయానని సబ్బం హరి చెప్పారు. దీంతో ఆ మూడో ఎంపి ఎవరనేది ఇప్పుడు కాంగ్రెసు పార్టీలో చర్చలు సాగుతున్నాయి.

వైయస్ జగన్‌ను బలపరిచే పార్లమెంటు సభ్యుడు కచ్చితంగా రాయలసీమ నుంచే ఉంటాడనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, మంత్రి పదవి కోల్పోయిన సాయి ప్రతాప్ కావచ్చుననే అనుమానం కూడా వచ్చింది. అయితే, ఆ ఎంపి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి బంధువని అంటున్నారు. దాంతో సాయిప్రతాప్ విషయాన్ని కొట్టిపారేయవచ్చు. బహుశా, అనంత వెంకట్రామి రెడ్డి కావచ్చునని కాంగ్రెసు వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

English summary
With MP Sabbam Hari's statement about third MP supporting YSR Congress party president YS Jagan, became discussion point in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X