వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సాక్షి' 2011 న్యూస్ మేకర్స్‌లో జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని సాక్షి దిన పత్రిక 2011 న్యూస్ మేకర్స్‌లో ఒకరిగా పేర్కొంది. అవినీతిపై ఉద్యమం చేస్తున్న అన్నా హజారే, పశ్చిమ బెంగాల్‌లో ముప్పై అయిదేళ్ల కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడిన మమతా బెనర్జీ, డిఎంకెను మట్టికరిపించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, 28 ఎనిమిదేళ్ల అనంతరం ప్రపంచ కప్ కలలు నిజం చేసిన ఎంఎస్ ధోనీ, కౌన్ బనేగా కరోడ్ పతిలో రూ.5 కోట్లు గెలుపొందిన సుశీల్ కుమార్, కర్నాటక మాజీ సిఎం యెడ్యూరప్ప, ఐ టెక్నాలజీని పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్ మరణం, ఒసామా బిన్ లాడెన్ అంతం, లిబియా నియంత గడాఫీ హతం తదితరులను 2011 న్యూస్ మేకర్స్‌గా పేర్కొంది. వారితో పాటు అందులో జగన్‌ను కూడా పేర్కొంది.

దేశంలోనే అత్యంత శక్తిమంతురాలిగా నేతలు అభివర్ణించే సోనియా గాంధీనే ఎదిరించి కాంగ్రెసు నుండి బయటకు వచ్చి ప్రత్యేక పార్టీని స్థాపించి అందరి దృష్టినీ జగన్ ఆకర్షించారని, కడప ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారని పేర్కొంది. దేశంలో ఐదు లక్షల భారీ మెజార్టీతో గెలుపొందిన ముగ్గురు ప్రముఖుల సరసన జగన్ చేరిన విషయాన్ని ప్రస్తావించింది. జగన్ భారీ మెజార్టీ సాధించడమే కాకుండా కాంగ్రెసు, టిడిపి అభ్యర్థుల డిపాజిట్లు కూడా గల్లంతైన విషయం తెలిసిందే.

English summary
Sakshi daily stated that YS Jaganmohan Reddy is 2011 news maker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X