వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్! క్విట్ కర్ణాటక!

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు కర్ణాటకలో సెగ మొదలైంది. బిజెపి, కాంగ్రెసులకు రెంటికీ ఆయన వ్యతిరేకంగా పనిచేస్తుండడంతో ఆ సెగ తప్పలేదని అంటున్నారు. వైయస్ జగన్ కర్ణాటకలో రూ.కోట్ల ఆస్తులు, గనులు కొల్లగొట్టారని రైతు సంక్షేమానికి కృషిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ 'కస్తూరి కర్ణాటక జన ప్రవేదిక' ఆరోపించింది. కృష్ణా ట్రైబ్యునల్‌ తీర్పుపై ఇటీవల ఆయన ఢిల్లీలో చేసిన జలదీక్షను వ్యతిరేకిస్తూ సంస్థ శనివారం జంతర్‌ మంతర్‌ వద్ద ర్యాలీ, ధర్నా నిర్వహించింది. తమ రాష్ట్రానికి వ్యతిరేకంగా జగన్‌ దీక్ష చేయడం దొంగ నాటకమని పేర్కొంది. ''ట్రైబ్యునల్‌ తీర్పునకు వ్యతిరేకంగా దీక్ష చేసిన జగన్‌ వెంటనే కర్ణాటక వదలిపోవాలి. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే దేవనహల్లిలోని ఆయన బంగళాను ధ్వంసం చేస్తాం. ఆయన్ను రాష్ట్రానికి రానివ్వం'' అని హెచ్చరించింది.

జగన్‌ అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ రాష్ట్రపతికి వినతిపత్రం పంపామని, ఇదే విషయమై సోమవారం ప్రధానిని కలవనున్నామని జన ప్రవేదిక అధ్యక్షుడు రమేశ్‌ గౌడ తెలిపారు. కర్ణాటక మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, ఏపీ మాజీ సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం కలిసి ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో గనుల పేరిట రూ.కోట్లు కొల్లగొట్టారన్నారు. ఈ డబ్బుతో దేవనహల్లి అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన జగన్‌ వందల ఎకరాలు సంపాదించారని ఆరోపించారు. తన రక్షణ కోసం కర్ణాటకలో ఉంటూ కర్ణాటకకు వ్యతిరేకంగా దీక్ష చేయడం తగదన్నారు.

English summary
Ex MP YS Jagan is facing opposition in Karnataka also. Kasturi Karnataka Jana Pravedika activists staged dharna at 
 
 Janthar manthar on saturday. They gave slogans against YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X