• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్ జగన్ ఎమ్మెల్యేవి అన్నీ బీరాలేనా?

By Pratap
|

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన కాపు రామచంద్రా రెడ్డివి అన్నీ బీరాలేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరనే మాట వినిపిస్తోంది. విప్‌ను ధిక్కరణపై స్పీకర్ ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వడానికి ఆయన వ్యూహాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తన వ్యూహాల ద్వారా అనర్హత వేటును తప్పించుకోవాలనేది ఆయన ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. దానిపై అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను ఆయన మంగళవారం రెండు సార్లు కలిశారు.

తాము రైతుల కోసం విప్‌ను ధిక్కరించామని ఒక్క వాక్యం రాసేస్తే పని అయిపోతుందని, ఆ మాత్రానికే కాపు రామచంద్రా రెడ్డి ఇంత చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. అలా రాసిస్తే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టే చెమటలు పట్టేట్లు తిరుగుతున్నారని ఆడిపోసుకుంటున్నారు. లోకసభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కథ కూడా అలాగే సాగుతోందనే మాట వినిపిస్తోంది. దీన్ని బట్టి తాము ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు చెబుతున్న మాటలు పైకి మాత్రమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
It is said that YSR Congress president YS Jagan camp MLA Kapu Ramachandra Reddy is not ready to face bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X