వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ వివేకావి ఉత్తర ప్రగల్భాలేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో వదిన విజయమ్మపై పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ వివేకానంద రెడ్డివి ఉత్తర ప్రగల్భాలే అవుతాయా అనే మాట వినిపిస్తోంది. నిజానికి, ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. నామినేటెడ్ పదవులు తీసుకోనని, పులివెందులలో గెలిస్తేనే మంత్రి పదవి తీసుకుంటానని చెప్పిన వైయస్ వివేకానంద రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందనేది అంతు పట్టకుండా ఉంది.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. లేదంటే, రాజ్యసభకు వివేకాను తీసుకోవడానికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉందని చెబుతున్నారు. కానీ, సవాల్ మీద నిలబడి ఆ పదవులను వివేకానంద రెడ్డి తీసుకోకపోతే ఏమవుతుంది, ఆయన రాజకీయ భవిష్యత్తుకు తలుపులు మూసుకుంటాయా అనేది వేచి చూడాల్సిందే.

English summary
Congress leader YS Vivekananda Reddy's political future in dilemma. He does not want to take nominated posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X