వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధోనీని యువీ ఏడిపిస్తాడా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Yuvraj Singh
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఏడిప్తానని పూణే వారియర్స్ కెప్టెన్ యువరాజ్ సింగ్ అంటున్నాడు. అయితే, ఆటలో మాత్రం కాదు. తన పెళ్లికి గేటు బయట నిలబెట్టి ధోనీ చిందులేసేలా చేస్తానని అతను వ్యాఖ్యానించాడు. ధోనీ ఎవరినీ ఆహ్వానించకుండా పెళ్లి చేసేసుకున్నాడు. అది మరిచిపోతానా అంటున్నాడు యువీ. ''అతడు తన పెళ్లికి ఆహ్వానించనేలేదు. రోజులో పదిసార్లు దీనిపై అతడిని ఏడిపిస్తాను. నా పెళ్లికి జట్టులో అందరినీ ఆహ్వానిస్తా, నిన్ను మాత్రం గేటు బయటే చిందులేసేలా చేస్తా అని ధోనీతో అన్నా'' అని చెప్పాడు.

ధోనీతో తనకెలాంటి విభేధాల్లేవని అన్నాడు. ''మా ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అతడెప్పుడూ నాకు అండగా నిలిచాడు. నేను అతడికి మద్దతు పలికా. మా మధ్య సఖ్యత లేదన్న ఊహాగానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు'' అని చెప్పాడు. మరి మీరిద్దరూ ఒకే బాలీవుడ్‌ నటిని ఇష్టపడ్డ సంగతేమంటే.. ''నేనూ పత్రికల్లో చదివా'' అని దాటవేశాడు. దీన్ని బట్టి ధోనీతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని యువీ తాపత్రయపడుతున్నాడని అర్థమవుతోంది.

English summary
Pune Warriors captain Yuvraj Singh said that he will make Chennai Super Kings captain Mahendra Singh Dhoni to weep.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X