వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయప్రద ప్రత్యర్థి యుపి స్పీకర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprada
రాంపూర్‌లో పార్లమెంటు సభ్యురాలు జయప్రద ప్రత్యర్థి ఆజం ఖాన్ ఉత్తరప్రదేశ్ శానససభ స్పీకర్ పదవి చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇది జయప్రద కోసమో, మరెవరి కోసమో కాదు- ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ రాజకీయాల్లో భాగంగానే ఆయనకు ఆ పదవి దక్కుతోంది. ఎస్పీ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే అఖిలేష్ యాదవ్‌కు రిపోర్టు చేయకుండా ఉండడానికే అంటున్నారు. స్పీకర్ అసమ్మతి ఎమ్మెల్యేలను కూడగట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన సందర్భాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి.

ఆజంఖాన్ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి దూరంగా ఉన్నారు. ములాయం సింగ్ హెలికాప్టర్ పంపినా ఆయన రాలేదు. అయితే, తనకు అత్యంత సన్నిహితులైన శానససభ్యులతో ఆజం ఖాన్ సమావేశమయ్యారు. ఆ తర్వాత ములాయం సింగ్‌ను కలిశారు. రాజీ ఫార్ములాలో భాగంగానే ఆజం ఖాన్‌కు స్పీకర్ పదవి ఇవ్వాలనే ఆలోచనలో ములాయం సింగ్ ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద, తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌కు ముఖ్యమంత్రి కావడానికే ములాయం సింగ్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

English summary
One compromise formula in the Samajwadi Party doing the rounds is Azam Khan would be made UP assembly speaker, which would ensure the senior leader does not have to report to Mulayam's son Akhilesh once he become CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X