వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌కు సిపిఎం రాఘవులు షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
మెదక్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు సిపిఎం రాష్ట్ర కార్యదర్సి బివి రాఘవులు షాక్ ఇచ్చారు. ఇంత కాలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సిపిఎం దగ్గరవుతూ వస్తుందనే సంకేతాలు ఇప్పటి వరకూ వెలువడతూ వచ్చాయి. వామపక్షాలతో దోస్టీ కట్టాలని వైయస్ జగన్ మొదటి నుంచీ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, సిపిఐ వైయస్ జగన్‌కు దూరమవుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి దగ్గర కాగా, సిపిఎం మాత్రం వైయస్ జగన్‌తో దోస్తీ వెసులుబాటును కాపాడుకుంటూ వచ్చింది.

ఎట్టకేలకు, జగన్‌తో దోస్తీ కట్టే ప్రసక్తి లేదు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు తేల్చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో గానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో గానీ తాము కలిసి పనిచేయబోమని రాఘవులు స్పష్టం చేశారు. వామపక్ష, ప్రజాతంత్ర పార్టీలతో కలిసి పనిచేయాలని తమ పార్టీ నిర్ణయించిందని, అయితే తమ నిర్ణయంతో సిపిఐ విభేదిస్తోందని ఆయన చెప్పారు. వామపక్షాల మధ్య ఐక్యతకు ప్రయత్నిస్తామని చెప్పారు.

సిపిఎం మెదక్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై మరింత కాలం వేచి చూడాలన్న కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమని ఆయన అన్నారు. తెలంగాణ విషయంపై ఆయన మాటలను కాసేపు పక్కన పెడితే సిపిఎం మాత్రం ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

వైయస్ జగన్‌పై అవినీతి ఆరోపణలు తమను ఆత్మరక్షణలో పడేసే ప్రమాదం ఉందని గ్రహించే కాబోలు సిపిఎం వైయస్సార్ కాంగ్రెసుకూ దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచరం. ఏమైనా, వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్‌కు ఒంటరి పోరు తప్పేట్లు లేదు.

English summary
CPM has decided not to worl with YS Jagan's YSR Congress. CPM state secretary BV Raghavulu has made a statement on this regard. He also saif that CPM will not make any alliance with N Chandrababu Naidu's Telugudesam party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X