వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు: సూరీడిపై సిబిఐ ఒత్తిడి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sureedu - YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేసును బలోపేతం చేయడానికి సిబిఐ వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకు వైయస్ రాజశేఖర రెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు సూరీడును వాడుకోవాలని సిబిఐ ప్రయత్నిస్తోందంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్సిస్తోంది.

వైయస్ జగన్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని సిబిఐ సూరీడిపై తీవ్రమైన ఒత్తిడి పెడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. వైయస్ జగన్‌కు బెయిల్ రాకుండా సిబిఐ కుట్ర చేస్తోందని కూడా విమర్శిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రావడానికి ముందుకు ఆయనకు, వైయస్ జగన్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు బెరైటీస్ గునలు తప్ప మరేమీ లేదని సూరీడు సిబిఐకి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

వైయస్ జగన్ సంపదను పోగు చేసుకోవడానికి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు కూడా సూరీడు సిబిఐకి చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, అవే విషయాలను మెజిస్ట్రేట్ ముందు చెప్పడానికి సూరీడు నిరాకరించినట్లు సమాచారం.

సిబిఐ వద్ద కీలకమైన విషయాలను బయట పెట్టిన సూరీడు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చేసరికి వెనక్కి తగ్గారని అంటున్నారు. దీనిపైనే సూరీడిపై సిబిఐ తీవ్రమైన ఒత్తిడి పెడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.

English summary
The YSR Congress said that the CBI is trying to put pressure on YSR’s personal assistant Sureedu to give a statement against Jaganmohan Reddy and his family and added that it was all part of a political conspiracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X