వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్ యాదవ్ ముందు అన్నీ సవాళ్లే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akhilesh Kumar
ఉత్తర ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్ పాలన నల్లేరు మీద నడక ఏమీ కాదు. ఆయన ముందు పలు సవాళ్లు ఉన్నాయి. పరిపాలన, ప్రభుత్వ నిర్వహణలో అనుభవం లేని ఆయన ఆ లోపాన్ని అధిగమించి సుపరిపాలన అందివ్వడం కత్తిమీద సాము అని చెప్పవచ్చు. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన అభివృద్ధి, అవినీతి నిర్మూలన అనే మాటలు అటుంచితే రౌడీల పార్టీగా ముద్రపడిన ఎస్పీని ప్రక్షాళన చేయడంతో పాటు ఆ ముద్రను తొలగించడం అఖిలేష్ ముందున్న అతి పెద్ద సవాల్. ప్రజలకు అసాంఘీక శక్తుల నుండి భద్రత కల్పించడం ప్రధాన సవాల్. అరాచకాలు, కుల ఘర్షణలు, ముఠా తగాదాల నుంచి యుపిని ఆయన ఎలా బయట పడేస్తారో చూడాలి. అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమన్వయ పర్చాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.

అంతేకాకుండా మేనిఫెస్టోలోని పథకాలు అమలుపర్చడం ఆయనకు మరో సవాల్. విద్యార్థులకు టాబ్లెట్ పిసిలు, ల్యాప్‌టాప్‌లు కష్టంతో కూడుకున్న పని. దాదాపు ఇరవై కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందరికీ అవి పంచితే ఆర్థికంగా ప్రభుత్వంపై పెనుభారం. నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్ కూడా కష్ట సాధ్యం. మంత్రివర్గంలో యువతకే ఎక్కువ పీట వేయాలని భావిస్తున్న అఖిలేష్‌కు సీనియర్ల నుండి వ్యతిరేకత వస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి దేశ రాజకీయాలను మలుపు తిప్పగల యుపి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అఖిలేష్‌కు అనుభవం కూడా చాలా తక్కువ. మరి ఎంత మేరకు ఆయన సఫలం అవుతారో చూడాలి.

English summary
SP leader Akhilesh Kumar will face many challenges as CM like, laptap and tablet PCs to students, current.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X