వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరోల దారిలో: బాబుకు టాప్ డైరెక్టర్ల సూచనలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ బలోపేతం కోసం సినీ డైరెక్టర్ల సలహాలు తీసుకుంటున్నారా అంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక అవుననే అంటోంది. టాప్ హీరోలు తమకు వరుస ప్లాపులు వచ్చినప్పుడు టాప్ డైరెక్టర్ల వద్దకు వెళ్లి మంచి హిట్ ఇవ్వాలని కోరడం సహజమని.. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాటలో పయనిస్తున్నారని పేర్కొంది.

తొమ్మిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని రక్షించుకునేందుకు సినీ దర్శకులను ఆశ్రయించారని, వచ్చే నెల 2వ తేది నుండి నిర్వహించే జన చైతన్యంలో ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో చెప్పాల్సిందిగా వారిని కోరుతున్నారని రాసింది. ఈగ సినిమాతో మరో హిట్ సాధించిన దర్శక జక్కన్న రాజమౌళితో పాటు శ్రీను వైట్ల, తేజ తదితర సినీ దర్శకులను బాబు కోరారని తెలిపింది.

తాను పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, ఎలా వెళితే బాగుంటుందో వివరించాల్సిందిగా ఆ దర్శకులను బాబు కోరారట. ప్రజల్లోకి వెళ్లినప్పుడు హావభావాలు ఎలా ఉండాలి, ప్రజల్లో ఎలా కలిసి పోవాలి వంటి వాటిపై వారి నుండి సూచనలు తీసుకుంటున్నారట.

కాగా బాబు పాదయాత్ర కోసం సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, హరిరామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్ రాసిన పాటలకు వందేమాతరం శ్రీనివాసం సంగీతం అందిస్తున్నారు. రికార్డింగ్ ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుందని చెబుతున్నారు. అయితే డైరెక్టర్లను ఆశ్రయించిన బాబు తన వియ్యంకుడు, హీరో బాలకృష్ణ సూచనలు కోరడం మరిచిపోయారని చివరలో వ్యాఖ్యానించింది.

English summary

 Telugudesam Party chief Nara Chandrababu Naidu is taking cine directors suggestions to make success his padayatra, said YSR Congress party chief YS Jaganmohan Reddy's Sakshi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X