వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొలవేరిపై మనసు పారేసుకున్న కాంగ్రెసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Dhanush
తమిళ నటుడు ధనుష్ కొలవేరి డీపై కాంగ్రెసు పార్టీ మనసు పారేసుకుందట. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారానికి వాడుకునేందుకు కొలవెరీ డీ హక్కుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. గతంలో ఎఆర్ రెహ్మాన్ జై హో పాటను కాంగ్రెసు పార్టీ వాడుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ యువతను ఆకట్టుకోవడానికి కొలవేరి డీని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. కొలవేరీ డీ హక్కుల కోసం కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు సాగిస్తోందంటూ ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్ రాసింది. పార్టీ రెండో థీమ్ సాంగ్‌గా దాన్ని మార్చుకోవాలనేది కాంగ్రెసు నాయకుల ఆలోచన.

కాంగ్రెసు తయారు చేసిన పాటను చూసిన తర్వాత తాను ఏదైనా చెప్తానని ధనుష్ తప్పించుకునే ప్రయత్నాలు చేశారట. అయితే, ప్రముఖ నటుడు, పార్లమెంటు సభ్యుడు రాజ్ బబ్బర్ ధనుష్‌తో మాట్లాడి మనసు మార్చినట్లు చెబుతున్నారు. అయితే, ఆ విధమైన ప్రయత్నాల గురించి తనకు తెలియదని, ఇది తనకు కూడా వార్తేనని ధనుష్ చెప్పినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. సోనీకి కాపీ రైట్ హక్కులున్నాయని, వారేమైనా సోనీతో మాట్లాడారేమోనని ధనుష్ అన్నారట. తనది రాజకీయ గేయం కాదని కూడా ఆయన చెప్పుకొచ్చారట. ఏమైనా, ధనుష్‌ రాతే ఆ పాటతో మారిపోయింది.

English summary
Though the party has decided to stick to its lucky theme song Jai Ho, it is also exploring the possibility of using the popular Why this kolaveri di? featuring Dhanush to connect with the youth ahead of the UP Assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X