వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాస అధినేత కెసిఆర్ బిహారీయా?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మూలాలపై మాజీ శాసనసభ్యుడు అడుసుమిల్లి జయప్రకాష్ కొత్త వాదనను ముందుకు తెచ్చారు. కెసిఆర్ బీహార్ నుంచి వలస వచ్చారని ఆయన అంటున్నారు. అందుకే కెసిఆర్‌కు తెలుగుతల్లిపై ప్రేమ లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగు తల్లిపై, నన్నయ్య ఆదికవి కాదంటూ.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత కవులు, రచయితలు స్పందిస్తారని ఆశించామన్నారు.

కానీ 'ఆదికవి నన్నయ్య' అంటూ సినీగేయాన్ని రాసిన సి.నారాయణరెడ్డి కూడా నోరు విప్పకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "ఆదికవి నన్నయ్య అవతరించిన నేల' అని రాసిన సినారె 'మన తెలంగాణలో రణభేరి మోగింది. ఆంధ్ర సంఘాలు ఊరూరా పెట్టాలి. తెలుగుతల్లికి జేజేలు. తెలుగుతల్లికి కానుకలు అందించాలి' అన్న దాశరథిని కెసిఆర్‌ కాదనుకుంటారా? 'తేనెతెట్ల నవకంపు సోనలకును సాటియగును మా తెలుగు భాషామతల్లి' అన్న సురవరం ప్రతాపరెడ్డిని తరిమికొడతారా? అలాంటి రచనలే చేసిన కాళోజీ నారాయణరావును, సుద్దాల హనుమంతును తప్పుపడతారా?'' అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

వందల ఏళ్లుగా తెలుగు తల్లిని ప్రాంతాలకతీతంగా పూజించి, గౌరవిస్తున్న తెలుగువారి మధ్య ప్రాంతీయ చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 'తెలుగు తల్లికాదు.. తెలుగు దయ్యం' అంటోన్న కెసిఆర్ పూర్వీకులు బీహార్ ప్రాంతం నుంచి బొబ్బిలికి, అక్కడి నుంచి నైజాం ప్రాంతానికి వచ్చినట్లుగా కెసిఆర్ స్వయంగా అంగీకరించారని అడుసుమిల్లి చెప్పారు. దానిని నిరూపించేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.

కెసిఆర్ వెంట నడుస్తోన్న కేశవరావు జాదవ్ ఉత్తరప్రదేశ్ నుంచి, తెలంగాణ మేధావి ఫోరం నాయకులు రమా మెల్కోటీ మహారాష్ట్ర నుంచి వచ్చారన్నారు. జయశంకర్ కర్ణాటక ప్రాంతానికి చెందిన వారని, ఆలే నరేంద్ర, దేశపతులు, దేశపాండేలు మరాఠీలని అడుసుమిల్లి అన్నారు. తాజాగా తెరాస ముసుగు కప్పుకొన్న పేర్వారం రాములుది, ఉద్యోగ సంఘాల నేత విఠల్‌దీ మరాఠీ వారసత్వమేనని చెప్పారు. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి తెలుగుతల్లి మీద గౌరవం ఉండదని విమర్శించారు.ఈ విషయాన్ని తెలంగాణలోని తెలుగువారు, తెలుగు భాషాభిమానులు గుర్తించాలని కోరారు.

English summary
Former MLA Adusumilli Jayaprakash alleged that Telangana Rastra Samithi president K Chandrasekhar Rao family belongs to Bahar, so he is not having respect on Telugu Talli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X