వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేణుకా చౌదరి ఎంపిక: తెలంగాణ వైఖరి..?

By Pratap
|
Google Oneindia TeluguNews

Renuka Choudary
రాజ్యసభకు కె. కేశవ రావును తిరిగి నామినేట్ చేయకపోవడం, రేణుకా చౌదరిని ఎంపిక చేయడం తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం వైఖరిని స్పష్టం చేస్తోందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బలంగా కోరుకుంటున్న కేశవ రావును పక్కన పెట్టి తెలంగాణ కోటాలో రేణుకా చౌదరిని రాజ్యసభకు ఎంపిక ఆ విషయాన్ని స్ఫష్టం చేస్తోందని అంటున్నారు. రేణుకా చౌదరి తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఆమె తెలంగాణకు వ్యతిరేకంగానే పనిచేస్తానే అభిప్రాయం బలంగా ఉంది.

సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని ఎంపిక చేయడం కూడా అదే విషయాన్ని తెలియజేస్తోందని అంటున్నారు. మొదట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెగ మాట్లాడిన పాల్వాయి ఆ తర్వాత గొంతు తగ్గించడమే కాదు, మాట్లాడడమే మానేశారు. రాపోలు ఆనంద భాస్కర్‌ను ఎంపిక చేయడం వెనక పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఉన్నారని అంటున్నారు. రాజ్యసభ సీట్లు మూడు తెలంగాణకు దక్కాయి. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాకుండా అధిష్టానం ఆలోచనకు అనుగుణంగా పనిచేసే వారికే ఆ టికెట్లు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
It is said that Renuka Chaudhary selection to Rajyasabha is indicating anti - Telangana stand of Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X