వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి పిఎ అలీఖాన్ ఆస్తి కోట్లపైనే

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
అక్రమ మైనింగ్ కేసులో జైలు ఊచలు లెక్కిస్తున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెహఫుజ్ అలీఖాన్ తక్కువేమీ తినలేదట. అతని ఆస్తుల విలువ రూ. 250 కోట్ల పైనే ఉంటుందని ఆదాయం పన్ను శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అలీ బళ్లారి నివాసంలో 2010లో ఆదాయం శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గాలి జనార్దన్ రెడ్డి కళ్లు కప్పి ఇతర గనుల యజమానుల ముడి ఇనుమును అక్రమంగా తరలించి సొమ్ము కూడబెట్టాడని తేలినట్లు సమాచారం. ముడి ఇనుమును ఓడరేవులకు తరలించడానికి ఒక్కో టన్నుకు రెండు రూపాయల చొప్పున వసూలు చేసినట్లు తెలుస్తోంది.

స్టీల్ మిల్లు, బ్రాహ్మణి స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపన పనులు చూడడానికి గాలి జనార్దన్ రెడ్డి అలీఖాన్‌ను నియమించుకున్నట్లు సమాచారం. అక్రమ మైనింగ్ గురించి అలీఖాన్‌కు చాలా విషయాలు తెలుసునని సిబిఐ భావిస్తోంది. 60 లక్షల టన్నుల ముడి ఇనుము అక్రమంగా తరలినట్లు అలీఖాన్ ల్యాప్‌టాప్ హార్డ్ డిస్క్ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి అరెస్టయి నాలుగున్నర నెలలు అవుతోంది. అయినా అలీఖాన్ ఆచూకీ దొరకడం లేదు. అతని కోసం సిబిఐ లుకవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. అలీఖాన్ విషయంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నామా అనే మీమాంసలో సిబిఐ పడినట్లు చెబుతున్నారు.

English summary
If imprisoned mining baron Gali Janardhan Reddy’s empire is worth thousands of crores, the assets of K. Mehfuz Ali Khan, Reddy’s personal assistant and his trusted aide are not far behind at Rs 250 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X