వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్త పురంధేశ్వరికే జూనియర్ ఎన్టీఆర్ ఓటు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr NTR
హైదరాబాద్: తాతయ్య ఎన్టీ రామారావు విగ్రహ ప్రతిష్ఠాపన వివాదంలో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ అత్త దగ్గుబాటి పురంధేశ్వరికే మద్దతు తెలిపే అవకాశాలున్నాయని అంటున్నారు. విగ్రహ ప్రతిష్టాపన వివాదంలో నందమూరి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బాబాయ్ బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వగా, తండ్రి హరికృష్ణ పురంధేశ్వరి పక్కన నిలిచారు.

తండ్రి బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ నడుస్తారని అంటున్నారు. బాలకృష్ణ కూడా పురంధేశ్వరి విషయంలో కాస్తా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తన పేరు మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పురంధేశ్వరిపై, తన బావ దగ్గుబాటి వెంకటేశ్వర రావుపై అంత ఘాటు వ్యాఖ్యలతో ప్రకటన తయారు చేసి మీడియాకు విడుదల చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.

పార్లమెంటులో విగ్రహ ప్రతిష్టాపన విషయం తమ తండ్రి ఎన్టీ రామారావు అల్లుళ్లకు సంబంధించిన విషయం కాదని, పార్టీలకు సంబంధించింది కూడా కాదని చెప్పడం ద్వారా హరికృష్ణ బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చి పురంధేశ్వరికి నైతికమైన మద్దతు ఇచ్చారు. దాంతో ఎన్టీ రామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ కూడా బాలకృష్ణ వైఖరిని తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఏం చెబుతారనేది కాస్తా ఆసక్తికరమైన విషయమే.

అయితే, జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయంగానే కాకుండా వారసత్వపరంగా కూడా పురంధేశ్వరి పక్కన నిలుచోవడం మంచిదనే అభిప్రాయం ఉండవచ్చునని అంటున్నారు. అయితే, తాతగారి సంతానం తేల్చుకునే విషయం, తాను నోరు చేసుకోవడం మంచిది కాదనే ఉద్దేశంతోనే జూనియర్ ఎన్టీఆర్ ఉండవచ్చునని వినికిడి.

English summary
It is said that Nandamuri hero Jr NTR may support union minister and his aunt Daggubati Purndeswari in NT Rama Rao statue installation row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X