వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌కు దూరమవుతున్న కాపు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kapu Ramachandra Reddy
కాంగ్రెసు శానససభ్యుడు కాపు రామచంద్రా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దూరమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు జగన్ వెంట నడుస్తూ వస్తున్న ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గ్ శాసనసభా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్ వర్గానికి చెందిన శానససభ్యులందరితో పాటు ఆయనకుపై కూడా అనర్హత వేటు పడితే రాయదుర్గ్‌కు ఉప ఎన్నిక వస్తుంది. అయితే, ఉప ఎన్నికల్లో కాపు రామచంద్రా రెడ్డి పోటీ చేయడానికి సిద్ధంగా లేరని చెబుతున్నారు. జగన్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలే పోటీ చేయాలని అంటున్నారట.

విప్ ధక్కరించిన విషయంలో కూడా కాపు రామచంద్రా రెడ్డి గమ్మత్తుగా వ్యవహరిస్తున్నారు. తనకు విప్ అందలేదని ఆయన స్పీకర్ నాదెండ్ల మనోహర్ వద్ద వాదిస్తున్నారు. ఆ రకంగా ఆయన అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. జగన్‌కు దూరమవుతున్నప్పుడు వేటు వేయించుకోవడం ఎందుకనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ఇటీవల వైయస్ జగన్ అనంతపురం జిల్లా ధర్మవరంలో జగన్ చేపట్టిన నిరాహార దీక్షకు కూడా కాపు రామచంద్రా రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అయితే, కాపు రామచంద్రా రెడ్డి ఆంతర్యమేమిటనేది స్పష్టం తెలియడం లేదు.

English summary
It is said that Rayadurg MLA Kapu Ramachandra Reddy wants to distance away from YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X