వచ్చే ఉప ఎన్నికల్లో తాజా మాజీ శాసనసభ్యుడు కాపు రామచంద్రా రెడ్డి పోటీ చేయడానికి నిరాకరిస్తున్నారట. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కొత్త అభ్యర్థి కోసం వేటలో పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. కాపు రామచంద్రారెడ్డి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన స్థానంలో మరో అభ్యర్థి కోసం జగన్ పార్టీ అన్వేషిస్తోందని అంటున్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కాపు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ మరణం త ర్వాత ఆయన సహజంగానే జగన్ వైపు నిలిచారు. జగన్ చెప్పినట్లు ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వంపై అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసి తమ గ్రూపులోని 16 మందితోపాటు అనర్హత వేటుకు గురయ్యారు. ఆయా స్థానాల్లో పోటీ చేస్తారని అందరూ భావిస్తున్నారు. కానీ, కాపు మాత్రం ఇందుకు సుముఖంగాలేరని సమాచారం.