వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసును కాపాడలేకపోయిన కసబ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ajmal Kasab
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ ఉగ్రవాది మొహ్మద్ అజ్మల్ కసబ్ కూడా కాంగ్రెసు పార్టీని గట్టెక్కించలేకపోయాడు. ముంబై కాల్పులు నిందితుడు కసబ్‌కు ప్రభుత్వం హడావిడిగా, అత్యంత రహస్యంగా ఉరిశిక్షను అమలు చేసి దేశభక్తిని చాటుకుంది. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే కాంగ్రెసు పార్టీ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం కసబ్ ఉరితీతకు గడువు పెట్టిందనే వ్యాఖ్యలు అప్పట్లో వినిపించాయి.

పాకిస్తాన్‌పై, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై బిజెపి నిత్యం కాంగ్రెసును తప్పు పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కసబ్‌కు ఉరిశిక్షను అమలు చేయడం వల్ల బిజెపిని దెబ్బ తీయవచ్చునని కాంగ్రెసు భావించినట్లు చెబుతారు. దేశ భద్రత విషయంలో తాము రాజీపడబోమని, తాము ఓ వర్గాన్ని వెనకేసుకుని రావడం లేదని చెప్పుకోవడానికే కసబ్‌ను అంత త్వరగా ఉరి తీశారనే మాట అప్పట్లో వినిపించింది.

మోడీని గుజరాత్‌లో ఓడించడానికి ఆ సంఘటన ఉపయోగపడుతుందనే అంచనాకు కూడా కాంగ్రెసు వచ్చినట్లు చెబుతారు. కానీ, గుజరాత్ ఎన్నికల్లో మోడీ హవాను కాంగ్రెసు దెబ్బ తీయలేకపోయింది. అయితే, కొద్దిగా మాత్రం ఫలితాల్లో ప్రగతి సాధించినట్లు కనిపిస్తోంది. అయితే, లెక్కించదగిన స్థాయిలో లేదు. పైగా, నరేంద్ర మోడీకి కేశూభాయ్ పటేల్ వంటి నాయకులు సవాల్ విసిరారు.

కేశూభాయ్ పటేల్ బిజెపి నుంచి తప్పుకుని గుజరాత్ పరివర్తన్ పార్టీ (జిపిపి)ని స్థాపించారు. ఇది కాంగ్రెసు పార్టీనే ఎక్కువగా దెబ్బ తీసినట్లు కనిపిస్తోంది. సౌరాష్ట్రంలో జిపిపి కాంగ్రెసు పార్టీని దెబ్బ తీసినట్లు అంచనాలు సాగుతున్నాయి. ఏమైనా, ఆపద్ధర్మంగా అప్పటికప్పుడు ఓటర్లను మెప్పించడానికి తీసుకునే చర్యలు కాంగ్రెసును గట్టెక్కించలేవనే విషయాన్ని కాంగ్రెసు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.

English summary
Implementation of death sentence to Pakistani terrorist Mohammad Ajmal Kasab has not helped Congress in Gujarat Assembly polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X