• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కత్రినా కైఫ్ నెంబర్: నిద్రకు దూరమైన టెక్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews
Katrina Kaif
రాంగ్ నెంబర్ గుర్గావ్‌కు చెందిన టెక్కీ శిప్రా సేథ్‌ను నిద్రకు దూరం చేసింది. ఓ కూల్ డ్రింక్ కంపెనీ ఆమె సెల్‌ఫోన్ నెంబర్‌ను కత్రినా కైఫ్ ఉన్న ఓ అడ్వర్టయిజ్‌మెంట్ ప్రకటనపై వచ్చేసిందట. దీంతో శిప్రాకు ఫోన్ కాల్స్ వరదలెత్తాయి. అశ్లీల సందేశాలు రాసాగాయి. గత నాలుగు వారాలుగా వాటితో ఆ టెక్కీకి నిద్ర కరువైంది. ఫిబ్రవరి నుంచి కత్రినా కైఫ్ ఉన్న వాణిజ్య ప్రకటన టీవీల్లో ప్రసారమవుతూ వస్తోంది.

ప్రతి రోజూ పది వేలకు పైగా ఫోన్ కాల్స్, పెద్ద యెత్తున మెసేజ్‌లు వస్తున్నాయని ఆ అమ్మడు వాపోతోందట. తాను కత్రినాను కాదని చెప్పినా వారు వినడం లేదంటూ ఆమె చెప్పినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. తాము నెంబర్ ఇవ్వలేదని, తామేమీ చేయలేమని కూల్ డ్రింక్ కంపెనీ చేతులెత్తేస్తోందట. వినియోగదారులు రాంగ్ నెంబర్‌కు కాల్స్ చేస్తే తమది బాధ్యత కాదని అంటోందట. జనవరి 4 నుంచి బ్యాక్ పెయిన్‌తో సెలవులో ఉన్న ఆ టెక్కీకి ఫోన్ కాల్స్ విశ్రాంతి లేకుండా చేస్తున్నాయని ఆ అమ్మడు వాపోతోందని ఆ పత్రిక రాసింది.

English summary
A wrong number can rob you of your peace, Shipra Seth, a Gurgaon-based software professional, learnt this the hard way. A soft drinks company printed her cellphone number "erroneously" in one of their advertisement campaigns featuring actress Katrina Kaif.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X