వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై విజయమ్మను ప్రయోగించిన కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - YS Vijayamma
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మను ప్రయోగించారా అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు తెలుసుకునేందుకే ముఖ్యమంత్రి విజయమ్మ సిరిసిల్ల పర్యటనకు అనూహ్యంగా పెద్ద ఎత్తున భద్రతను కల్పించారని అంటున్నారు.

గతంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీమాంధ్ర జిల్లాల్లో సాధారణ ప్రతిపక్ష కార్యకర్తలు అడ్డుకోవడం మినహాయించి అంతా ప్రశాంతంగా జరిగింది. అయితే తెలంగాణలో మాత్రం అందుకు భిన్నం. వరంగల్ జిల్లాలో ప్రతిపక్షాలతో పాటు తెలంగాణవాదులు ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కార్యక్రమం అర్ధాంతరంగానే ముగిసిందని చెప్పవచ్చు.

ఇప్పుడు ఆయన తాజాగా ఇందిర బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ కార్యక్రమం పూర్తయింది. శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఆ తర్వాత తెలంగాణలోని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కిరణ్ భావిస్తున్నారు. అయితే తనకు రచ్చబండ కార్యక్రమంలో ఎదురైన పరాభవం ఇందిర బాటలో పునరావృతం కాకూడదన్న గట్టి భావనతో ఆయన ఉన్నారు.

దీంతో ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో చేపట్టే ముందు ఇక్కడి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం కిరణ్ చేశారట. అయితే అంతలో వైయస్ విజయమ్మ చేనేత దీక్ష తలపెట్టడంతో కిరణ్‌కు పరిస్థితి తెలిసే అవకాశం లభించిందని, దీంతో అతను భారీ బలగాలతో ఆమె దీక్షకు అనుమతించారని, తద్వారా తెలంగాణలో పర్యటిస్తే ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశం దొరికిందని చెబుతున్నారు.

English summary

 It is said that CM Kiran Kumar Reddy has used YSR Congress party honorary president and Pulivendula MLA YS Vijayamma on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X