వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9న కిరణ్‌కు షాక్: సిఎం రేసులో మర్రి!?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Marri Sasidhar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ నెల 9న కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఝలక్ ఇవ్వనుందా, ఆయన స్థానంలో మరొకరు కూర్చోనున్నారా అంటే జరగవచ్చనే ఊహాగానాలు ఢిల్లీలో జోరుగా సాగుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి పట్ల క్రమంగా పార్టీ అధిష్టానం వైఖరి మారుతున్నప్పటికీ 2014లో గట్టెక్కాలంటే తెలంగాణ వారికే పదవి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంతో పార్టీ అధిష్టానం ఉందని చెబుతున్నారు.

అందులో భాగంగా కిరణ్‌ను మార్చి ఆయన స్థానంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మరొకరికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. రేసులో జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి ప్రధానంగా ఉన్నారట. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి, శాసనమండలి సభ్యుడు డి శ్రీనివాస్‌ల పేర్లను కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని తెలుస్తోంది.

మర్రి కుటుంబానికి పార్టీ అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడి, వివాదరహితుడు కావడం, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో ఉన్న అనుబంధం తదితరాలు బాగా కలిసి వస్తాయని అంటున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులకు శశిధర్ రెడ్డి విందు కూడా ఇచ్చారు. అయితే తన తండ్రి మర్రి చెన్నా రెడ్డి మీద పైన తెలంగాణ ఉద్యమం విషయంలో ఇప్పటికీ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఆ పదవికి ఓకె చెప్తారా లేదా అనేది చూడాలని అంటున్నారు.

మర్రి తర్వాత డి శ్రీనివాస్ పేరును కూడా సీరియస్‌గానే పరిశీలిస్తోందని అంటున్నారు. డి శ్రీనివాస్‌కు తెలంగాణతో పాటు సీమాంధ్రలోనూ మద్దతు లభిస్తోందని అధిష్టానం భావిస్తోందని సమాచారం. దీంతో ఆయనకు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తోందని అంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవి కాకపోయినా పార్టీలో మరో ప్రాధాన్యత ఉన్న పదవిని ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లుగా సమాచారం.

ముఖ్యమంత్రి పదవి తప్ప మిగిలిన అన్ని శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన జానా రెడ్డి పేరును కూడా పరిశీలిస్తోందట. సిఎం మార్పుపై కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ అధిష్టానం ఖండిస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా మార్పు జరుగుతుందా లేక పార్టీ అధిష్టానం తన వైఖరిని మరోసారి వాయిదా వేసుకుంటుందా చూడాలి.

English summary
It is said that Sanath Nagar MLA Marri Shashidhar Reddy is also in CM race along with Jana Reddy and D Srinivas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X