వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌కు మే గండం, 28వ తేదీ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం లాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మే సంక్షోభం తప్పదనే మాట వినిపిస్తోంది. మండుటెండలు కుతకుత ఉడికే మే నెలలో వైయస్ జగన్‌కు కష్టాలు తప్పవేమో అనిపిస్తోంది. గతంలో వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఓదార్పు యాత్ర సంఘటనలు మే నెలలోనే జరిగాయి. ఇప్పుడు ఆస్తుల కేసులో జగన్‌కు కోర్టు సమన్లు జారీ చేయడం, ఆయన మీడియా సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం మే నెలలోనే సంభవించాయి.

గతంలో తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నప్పటికీ పట్టుబట్టి మహబూబాబాద్ మహబూబాబాద్ ఓదార్పు యాత్రకు వైయస్ జగన్ బయలుదేరారు. అయితే, ఆయన అక్కడికి చేరుకోలేకపోయారు. అడుగడుగునా తెలంగాణవాదులు ఆయన ప్రయాణానికి అడ్డు పడ్డారు. 2010 మే 28వ తేదీన ఆయన మహబూబాబాద్‌లో ఓదార్పు యాత్రను తలపెట్టారు. ఇది హింసాత్మకంగా మారింది.

పరిస్థితి విషమించడంతో వైయస్ జగన్ ప్రయాణిస్తున్న రైలు మధ్యలోనే ఆగిపోయింది. పోలీసులు వైయస్ జగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో జగన్ ఓదార్పు యాత్ర చేపట్టలేకపోయారు. మళ్లీ 2012 మేలో ఆయన గండాలను ఎదుర్కుంటున్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ వేగంగా ముందుకు కదులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ నెల 28వ తేదీ ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. మే 28 తేదీన మహబూబాబాద్ పర్యటన సందర్భంగా పోలీసులు జగన్‌ను అదుపులోకి తీసుకోవడం, ఈ నెల 28వ తేదీన్నే ఆయన కోర్టుకు హాజరు కావాల్సి రావడం యాదృచ్ఛికమే కావచ్చు గానీ, చాలా మంది ఈ రెండు తేదీలకు లింక్ పెట్టి చూస్తున్నారు. వైయస్ జగన్‌ను 28వ తేదీన అరెస్టు చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
It is an interesting point that YSR Congress president YS Jagan's odarpu yatra proposed at Mahabubabad of Warangal district occurred in May. It was on May 28, 2010. And now YS Jagan is facing trouble in assets case in May itself. He has to attend to the court on May 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X