వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాను కిరణ్ ముఠాలో ఎమ్మెల్యే సోదరుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ముఠాకు సంబంధించిన విషయాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. ధర్మవరం శాసనసభ్యుడు వెంకటరాంరెడ్డి సోదరుడు వెంకట కృష్ణా రెడ్డి భాను కిరణ్ ముఠాలో ఉన్నట్లు వెల్లడైనట్లు వార్తలు వచ్చాయి. విజయవాడలో రెండు సంస్థల యాజమాన్య వాటాల విషయమై తలెత్తిన వివాదంలో ఇతని పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

వెంకటకృష్ణా రెడ్డి తండ్రి, మాజీ శాసనసభ్యుడు సూర్యప్రతాప్ రెడ్డికి వైయస్ రాజశేఖర రెడ్డితో సన్నిహిత సంబంధాలుండేవి. వారి కుటుంబాల మధ్య మంచి పరిచయం ఉంది. దీంతోనే సూర్యప్రతాప రెడ్డి లెటర్ హెడ్‌ సహాయంతో భాను కిరణ్ రెండు తుపాకులు కొన్నట్లు తెలుస్తోంది. భానుతో కలిసి చేసిన దందాల్లో వెంకటకృష్ణా రెడ్డి వాటాలు తీసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

భానుతో కలిసి ఒకేసారి వాటాలు తీసుకుని, అతనితోనే ఆయా కంపెనీల నుంచి వైదొలిగినట్లు చెబుతున్నారు. శ్రీసాయి అన్నపూర్ణ ప్యాకేజింగ్ ఇండియా, సాయి అన్నపూర్ణ బయో ప్రొటీన్ సంస్థ్లల్లో భానుతో కలిసి వెంకట కృష్ణా రెడ్డి డైరెక్టరుగా ఉన్నట్లు, అతనితోనే కలిసి బయటకు వచ్చినట్లు శనివారం వార్తలు వచ్చాయి.

భాను కిరణ్ సెటిల్మెంట్లు, భూదందాల ద్వారా రూ. 159 కోట్ల రూపాయలు సంపాదించినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 226 ఎకరాలకు పైగా భూములను భాను, అతని అనుచరులు సేకరించినట్లు సిఐడి వెల్లడించింది. వీటి విలువ రూ. 139 కోట్లు ఉంటుందని ఒక అంచనా.

English summary

 According to news reports - MLA Venkatram Reddy's brother Venkat krishna Reddy has worked with Bhanu Kiran, main accused in Maddelachervu Suri murder case. He get shares in settlements of Bhanu Kiran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X