వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీ9పై నిప్పులు కక్కిన జగన్ పార్టీ అభ్యర్థి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nallapureddy Prasnna Kumar Reddy
నెల్లూరు జిల్లా కోవూరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీవీ9పై నిప్పులు చెరిగారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌ను కూడా ఆయన వదిలిపెట్టలేదు. గతంలో తాను వైయస్ రాజశేఖర రెడ్డిపై చేసిన వ్యాఖ్యల క్లిప్పింగులు చూపించడం ఆయన కోపానికి కారణం. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలతో కుమ్మక్కయి టీవీ9 సిఇవో రవిప్రకాష్, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ ఎండి రాధాకృష్ణ కుమ్మక్కయి ఈ చర్యకు దిగుతున్నాయని ఆయన ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైశ్రాయ్ హోటల్లో చేసిన పనులను కూడా టెలికాస్ట్ చేయాలని ఆనయ ఆ చానెళ్లను డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేసిన దృశ్యాలను చూపించాలని అన్నారు. చంద్రబాబును ఎన్టీఆర్ ఔరంగజేబుగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలను ఆయన చదివి వినిపించారు. కోవూరు ప్రజలు ఇచ్చే తీర్పు ఆ రెండు చానెళ్లకు చెంపపట్టు అవుతుందని ఆయన అన్నారు.

English summary
YSR Congress Kovuru candidate Nallapureddy Prasnna Kumar Reddy lashed out at TV9 and ABN Andhrajyothy channel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X