చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైటెక్కులు, ఆన్‌లైన్‌లో 'నిత్య' దర్శనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Nithyananda Swami
న్యూఢిల్లీ: సినీ నటి రంజితతో రాసలీలలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కుని దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిత్యానంద స్వామి ప్రస్తుతం యూరప్‌లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. భారత్‌లో ఉంటే అరెస్టులు, కోర్టు కేసులు, వ్యతిరేక వర్గాల దాడులు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన నిత్యానంద యూరప్‌లో సేద తీరుతూ అక్కడ నుంచి తన భక్తులకు దర్శనమిస్తున్నట్టు సమాచారం.

నిత్యదర్శనం కోసం నిత్యానంద శిష్యబృందం హైదరాబాద్ శివారు ప్రాంతంలో జన సంచారం లేని చోట హైటెక్ సౌకర్యాలతో ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఇక్కడకు వచ్చే భక్తులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తూ తన ఆశీర్వాదం ఇస్తున్నట్టు సమాచారం. ఈ ఆన్‌లైన్ దర్శన భాగ్యం కోసం ఒక్కో భక్తుడు వేయి రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిత్యానంద స్వామిని మధురై ఆధీనం యువ పీఠాధిపతిగా తప్పించిన విషయం తెలిసిందే. అందుకు తాను ఆవేదనకు గురి కాలేదని నిత్యానంద స్వామి అప్పట్లో చెప్పాడు. అప్పట్లో నిత్యానంద స్వామి తిరువన్నమలైలోని తన ఆశ్రమంలో దర్సనమిచ్చి మీడియాతో మాట్లాడారు.

తాను యువ పీఠాధిపతి పదవి కావాలని అప్పట్లో అడగలేదని, ఇది అరుణగిరినాథ దేశికర్‌దేనని చెప్పారు. తన వల్ల సమస్యలు వస్తే తొలగిపోవడానికి తాను సిద్ధమేనన్నారు. యువ పీఠాధిపతిగా నిత్యానంద నియామకంపై నిరసనలు వెల్లువెత్తడం, తన పదవికే ఎసరు రావడంతో మదురై ఆధీనం పీఠాధిపతి అరుణగిరినాథ్ నిత్యానందను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఇటీవలనే ప్రకటించారు.

English summary
It is said that controversial godman Swami Nithyanada is giving meddage to his devotees through online. It is said that an Ashram was built in Hyderabad outskirts with high tech fecilities for devotees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X