వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ ప్రేరణ పింగళి దశరథరామ్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan’s ‘CGR’ inspires from Dasaradharam?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాకు ప్రేరణ జర్నలిస్టు పంగళి దశరథరామ్ కావచ్చునని వినికిడి. రాష్ట్రంలో ఎల్లో జర్నలిజానికి నికార్సైన అర్థం చెప్పినవాడు పింగళి దశరథరామ్. స్పై కెమెరాలతో చిత్రాలు తీసి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తన పత్రిక ద్వారా ఓ ఊపు ఊపినవాడు దశరథరామ్.

పింగళి దశరథరామ్ మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనవడు. పరిశోధనాత్మక జర్నలిజానికి ఆయన ఓ అర్థాన్నిచ్చారని ఆయన అభిమానులు అంటారు. ఎన్టీ రామారావు హయాంలో పింగళి దశరథరామ్ తన జర్నలిజానికి పదును పెట్టాడు. తన ఎన్‌కౌంటర్ పత్రికలో పలు పరిశోధనాత్మక వార్తాకథనాలు ప్రచురించారు. వాటిలో చాలా వరకు గాసిప్ వార్తాకథనాలు ఉండేవని గిట్టనివారు అంటారు. వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుని వెళ్లి పోరాటం సాగించేవారు.

ఎన్టీ రామారావు క్షుద్రపూజలు నిర్వహించాడంటూ పింగళి దశరథరామ్ ఫొటోలతో వార్తాకథనాన్ని ప్రచురించారు. అది అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. విజయవాడలో సైకిల్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో పింగళి దశరథరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. సినిమాలో పింగళి దశరథామ్ హత్య ఉదంతాన్ని కూడా తడిమారు.

పవన్ కళ్యాణ్ కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాలో పింగళి దశరథరామ్‌ను దృష్టిలో ఉంచుకుని కథను రూపొందించుకున్నట్లు చెబుతారు. తెలుగుదేశం పార్టీ హయాంలోని కొన్ని విషయాలను ఆ రకంగా సినిమాలో చొప్పించారని అంటున్నారు. దానివల్లనే సినిమా విడుదలైన రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సినిమాపై గుర్రుతో ఫ్లెక్సీలు, పోస్టర్లు తగులబెట్టారని చెబుతున్నారు. ఆ తర్వాత అది తెలంగాణ కోణం తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మౌనం దాల్చారు. ఏమైనా, కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమా ఇప్పుడు హాట్ టాపిక్.

English summary
Dasaradharam, the senior journalist character in Pawan Kalyan’s ” Cameraman Gangatho Rambabu” is based on journalist Pingali Dasaradharam who gave a new definition for Journalism in Andhra Pradesh by doing spy operations with hidden cams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X