వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌పై పుల్లా పద్మావతి అలక

By Pratap
|
Google Oneindia TeluguNews

Pulla Padmavathi
ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అలక వహించినట్లు సమాచారం. కాంగ్రెసు నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వరంగల్ జిల్లాకు చెందిన ఆమె వైయస్ జగన్ వెంట నడుస్తున్నారు. కాంగ్రెసు పార్టీపై ఆమె తనదైన రీతిలో ఇంత కాలం దుమ్మెత్తి పోస్తూ వచ్చారు. అకస్మాత్తుగా ఆమె జగన్ వెంట కనపించకపోయే సరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ దీక్ష శిబిరం వద్ద పుల్లా పద్మావతి సందడి లేదు. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆమె జగన్‌పై అలిగినట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో అడుగుపెట్టిన జగన్ వెంట లేకపోవడమే ఆమె అలకకు నిదర్శనమని అంటున్నారు. ఆమె గానీ ఆమె భర్త పుల్లా భాస్కర్ గానీ జగన్ దీక్షా శిబిరం వద్ద కనిపించలేదు. గతంలో వైయస్ జగన్ కార్యక్రమాల సందర్భంగా ఆమె ఎంతో సందడి చేసేవారు. జగన్‌కు ఢంకా బజాయించి మద్దతు పలుకుతూ వచ్చారు.

English summary
It is said that MLC Pulla Padmavathi is not happy with YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X