వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

4 నెలలుగా కనిపించని రైలింజన్ దొరికింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rail engine found after four months
నాలుగు నెలల క్రితం కనబడకుండా పోయన ఎలక్ట్రిక్ ఇంజన్‌ను రైల్వే అధికారులు ఎట్టకేలకు కనుగొన్నారు. పని నిమిత్తం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్‌కు ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ ఎలక్ట్రిక్ లోకోషెడ్‌కు చెందిన లోకో నెంబర్ 24039/డబ్ల్యుఏజి5/జిహెచ్ఎస్ విద్యుత్ ఇంజన్ వచ్చింది. షెడ్యూల్ ప్రకారం 60 రోజుల అనంతరం గూడ్స్ ఇంజన్ తిరిగి ఝాన్సీకి వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ ఇంజన్ ఎక్కడ ఉందో అధికారులు గుర్తించలేక పోయారు.

ఈ క్రమంలో ఇంజన్‌ను గుర్తించమని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఎలక్ట్రిక్ ఇంజనీర్ కార్యాలయం నుంచి కాజీపేట డ్రైవర్ల కార్యాలయానికి నోటీసులు అందాయి. ఈ విషయం మంగళవారం మీడియాలో రావడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్, మధ్య రైల్వే ముంబయి అధికారులు అన్ని సెక్షన్లలో ఆరా తీయగా... ముంబయి సెంట్రల్ రైల్వేలోని కల్యాణిలో గుర్తించారు. అనంతరం ఇంజన్‌ను నార్త్ సెంట్రల్ రైల్వే ఝాన్సీ ఎలక్ట్రిక్ లోకోషెడ్‌కు అప్పగించారు. ఇంజన్ దొరకడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ రైలింజన్‌ను గుర్తించమని కాజీపేట డ్రైవర్ల కార్యాలయానికి నోటీసులు అందడంతో వారు కాజీపేట రైల్వే స్టేషన్‌లోని కంట్రోల్ కార్యాలయం నోటీసు బోర్డు పైన ప్రకటన అంటించారు. ఈ ప్రకటన సంచలనం సృష్టించింది. సాధారణంగా కారు, బైక్ పోయాయని, పిల్లాడు తప్పి పోయాడని వార్తలు వింటుంటాం. కానీ ఏకంగా రైలింజన్ మిస్ అయిందనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

English summary
Railway officers found Rail Engine at Kalyani of Mumbai central railway, which is disappeared before four months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X